: మళ్లీ చిగురించిన శివసేన, బీజేపీ బంధం!


ఒకప్పటి మిత్ర పక్షాలైన బీజేపీ, శివసేన మళ్లీ దగ్గరైనట్టు కనిపిస్తోంది. అది కూడా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి శివసేన మద్దతునిస్తుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు తెలిపారు. శివసేనాధిపతి ఉద్దవ్ ఠాక్రేను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆదివారం భేటీ కావడం తాజా పరిణామాలకు ఊపిరిలూదింది. తమ అభ్యర్థిని ఖరారు చేసే ముందు ఎన్డీయే మిత్ర పక్షాలు అన్నింటినీ తప్పకుండా సంప్రదిస్తామని ఉద్దవ్ కు అమిత్ షా హామీ కూడా ఇచ్చారు.

ఉద్దవ్ ను కలిసిన వారిలో అమిత్ షాతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రావ్ సాహెబ్ దన్వే ఉన్నారు. ఈ సమయంలో శివసేన యువ విభాగం చీఫ్ ఆదిత్య ఠాక్రే కూడా అక్కడ ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఎన్డీయేలో ఐక్యత అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. బీజేపీ చిరకాల మిత్రపక్షమైన శివసేన అధిపతిని కలవడం తన బాధ్యతగా అమిత్ షా చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News