: ధోనీ నివాసం వద్ద భద్రత పెంపు, ఇతర ఆటగాళ్ల నివాసాల వద్ద కూడా!
ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ను టీమిండియా చిత్తుచేసి, ట్రోఫీని కైవసం చేసుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో పేలవమైన ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థి పాక్ తో భారత్ ఘోర ఓటమి పాలయింది. దీంతో, భారత అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అహ్మదాబాద్ లో కొంతమంది తమ టీవీలను రోడ్డు మీదకు తెచ్చి, ధ్వంసం చేశారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోహ్లీ, యువరాజ్ సింగ్, అశ్విన్ తదితర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా రాంచీలోని ధోనీ నివాసంతో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ఆటగాళ్ల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.