: ఆదిలాబాద్ పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో ఫుడ్ పాయిజనింగ్...37 మంది పోలీసులు ఆసుపత్రి పాలు


ఆదిలాబాద్ జిల్లాలో 37 మంది పోలీసులు ఆసుపత్రి పాలయ్యారు. ఆదిలాబాద్ ప్రధాన పట్టణంలోని  పోలీసు ట్రైనింగ్ క్యాంపులో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. దీంతో ట్రైనింగ్ లో ఉన్న 37 మంది కానిస్టేబుళ్లు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. ట్రైనింగ్ లో భోజనంపై పలు మార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా వారు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. గతంలో రెండు సార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా ఫిర్యాదు చేసిన కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు బెదిరించినట్టు సమాచారం. దీంతో మీడియాతో మాట్లాడేందుకు కానిస్టేబుళ్లు వెనకడుగు వేస్తున్నారు. 

  • Loading...

More Telugu News