: మళ్లీ 'దొంగ' అనిపించుకున్న మాల్యా... ఫైనల్ మ్యాచ్ లో కూడా చేదు అనుభవం!
భారతీయ బ్యాంకులను నిలువునా ముంచి వేలకోట్లు ఎగ్గొట్టి లండన్ లో తలదాచుకున్న బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. భారత్-పాక్ ఫైనల్ పోరును తిలకించేందుకు ఆయన ఓవల్ స్టేడియానికి వచ్చారు. స్టేడియం బయట మాల్యాను చూసి క్రికెట్ అభిమానులు 'దొంగ, దొంగ' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడినుంచి విసురుగా వెళ్లిపోయారు.
లీగ్ దశలో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ను వీక్షించేందుకు ఆయన వచ్చినప్పుడు కూడా అభిమానులు ఇలాగే దొంగ అంటూ అరిచి అవమానపరచగా.... ఒకరిద్దరు తాగుబోతులు అలా అరిచారని, మిగిలిన వారంతా తనతో కరచాలనానికి పోటీ పడ్డారని మాల్యా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం ఆయన అవమానభారంతో వెళ్లిపోయారు.