: హైదరాబాదును ముంచెత్తిన వాన...పలు ప్రాంతాలు జలమయం
హైదరాబాదును వర్షం ముంచెత్తింది. సికింద్రాబాద్ లోని ఓయూ క్యాంపస్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, లాలాపేట్, మల్లాపూర్, కాచిగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాప్రా, రామాంతపూర్, నేరేడ్ మెట్, మల్కాజిగిరి, హయత్ నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతోంది. అంతేకాకుండా హైదరాబాదు నగర వ్యాప్తంగా చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం హైదరాబాదు మాత్రమే కాకుండా రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ తదితర జిల్లాలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గోడకూలి ఒకరు, పిడుగు పడి మరొకరు మృతి చెందడంతో, ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.