: నా కుటుంబానికి రక్షణ కల్పించండి: పోలీసులను ఆశ్రయించిన కర్ణాటక సీఎం కోడలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోడలు స్మిత రాకేశ పోలీసులను ఆశ్రయించారు. బెంగళూరులోని మల్లేశ్వరంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఆమె, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బెంగళూరు పోలీసులను కోరారు. తన నివాస పరిసరాల్లో రాత్రి వేళల్లో అపరిచితులు తిరుగుతున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ఈ నెల 15న రాత్రి అపరిచితులు 2 గంటల ప్రాంతంలో సంచరించారని, ప్రహరీలోపల భారీ శబ్దం చేశారని చెప్పారు. అపరిచితుల అలికిడితో పెంపుడు కుక్క మొరగడంతో అప్రమత్తమయ్యామని, దీంతో వారు పారిపోయారని ఆమె తెలిపారు.