: ప్రపంచ హాకీ లీగ్ సెమీ ఫైనల్స్... పాక్ పై భారత్ విజయం
లండన్ వేదికగా జరిగిన ప్రపంచ హాకీ లీగ్ సెమీఫైనల్స్ లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. 7-1 తేడాతో పాక్ పై భారత జట్టు ఈ విజయాన్ని నమోదు చేసింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి భారతజట్టు ఆధిక్యత కనబరిచింది. భారత ఆటగాళ్లు హర్మన్ ప్రీత్, ఆకాశ్ దీప్, తల్వీందర్ సింగ్ రెండేసి గోల్స్ చేయగా, పర్ దీప్ మార్ ఒక గోల్ చేశాడు. అయితే, పాకిస్థాన్ జట్టు నుంచి ఒకే ఒక్క గోల్ ను మహ్మద్ ఉమర్ బుట్టా చేశాడు.