: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా


ఛాంపియన్స్ ట్రోఫీలో 339 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా రెండు ఓవర్లలోపే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ (5) ఔటయ్యారు. పాక్ బౌలర్ మహ్మద్ అమిర్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యు అయ్యాడు. అదే బౌలర్ బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన బంతిని షదాబ్ ఖాన్ క్యాచ్ పట్టాడు. కాగా, ప్రస్తుతం క్రీజ్ లో యువరాజ్ సింగ్ (1), శిఖర్ ధావన్ (1)  కొనసాగుతున్నారు. 3.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. 

  • Loading...

More Telugu News