: పాకిస్థాన్ వెళతా.. యోగా నేర్పిస్తా: రాందేవ్ బాబా


పాకిస్థాన్ వెళతానని, అక్కడి వారికి యోగా నేర్పిస్తానని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ లో యోగా నిర్వహించాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని, అక్కడికి వెళ్లి యోగా నేర్పిస్తానని చెప్పారు. పాకిస్థాన్ లోని ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులు కాదని, దాయాది దేశస్తులు అయిన వారు కూడా యోగా నేర్చుకోవాలని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.

అయితే, ముంబయి పేలుళ్ల లో ప్రధాన నిందితులైన దావూద్ ఇబ్రహీం, ఉగ్రవాద సంస్థ జైషే అహ్మద్ అధినేత మసూద్ అజహర్, ‘జమాత్’ అధినేత హఫీజ్ సయీద్ లను మట్టుబెట్టాలని అన్నారు. పాకిస్థాన్ లోని ప్రస్తుత రాజకీయ వాతావరణమే తనను కలచి వేస్తోందని, అయినప్పటికీ, తాను అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నానని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను భారత్ లో కలపాలని, దీనిపై ఆలోచించేందుకు భారత్ కు ఇదే సరైన సమయమని అన్నారు.

  • Loading...

More Telugu News