: ఎంపీ రామ్మోహన్ నాయుడి వివాహ విందుకు హాజరైన బాలకృష్ణ


శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహ విందుకు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. కోటబొమ్మాళి మండలంలోని రామ్మోహన్ నాయుడు స్వగ్రామం నిమ్మాడలోని కింజరాపు ఎర్రన్నాయుడు ప్రాంగణంలో ఈ వివాహ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. కాగా, ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. 

  • Loading...

More Telugu News