: తమిళ రైతులకు రూ.కోటి సాయం చేస్తానని రజనీకాంత్ హామీ
తమిళ రైతులకు కోటి రూపాయలు సాయం చేస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ హామీ ఇచ్చారు. చెన్నైలో నేషనల్ సౌత్ ఇండియన్ రివర్స్ ఇంటర్ లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.అయ్యకన్ను సహా పదహారు మంది రైతులను రజనీ కలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రజనీ అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చెప్పడానికి ఇదొక సూచనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తమిళ రైతులు సుమారు రెండున్నర నెలలకు పైగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయ్యకన్న ఆధ్వర్యంలోనే రైతులు ఈ నిరసనకు దిగారు.