: నిలకడగా కొనసాగుతున్న అలీ, జమాన్.. ‘పాక్’ స్కోరు పద్దెనిమిది ఓవర్లకు 100 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ జట్టు స్కోరు పద్దెనిమిది ఓవర్లు ముగిసే సరికి వంద పరుగులు పూర్తి చేసుకుంది. పాక్ ఓపెనర్లు అలీ, జమాన్ ల భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న అలీ 47 పరుగులు, జమాన్ 42 పరుగులతో ఉన్నారు. కాగా, పాక్ వికెట్ ఒక్కటీ పడకపోవడంపై భారత అభిమానులు నిరాశతో ఉన్నారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్, అశ్వన్, బుమ్రా, పాండ్యా, జడేజాలో ఎవరు వికెట్ పడగొడతారనే విషయం ఆసక్తిగా మారింది.