: 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్
64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడి అవార్డును జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో)కు దక్కించుకున్నాడు. ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్ లో నిన్నరాత్రి జరిగిన 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకకు ప్రముఖ సినీ నటులు హాజరయ్యారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో వివిధ భాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు. టాలీవుడ్ నుంచి అవార్డులు అందుకున్న వారి వివరాలు...
- ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో)
- ఉత్తమ నటి : సమంత (అ..ఆ)
- ఉత్తమ సహాయ నటుడు: జగపతిబాబు (నాన్నకు ప్రేమతో)
- ఉత్తమ సహాయ నటి: నందితా శ్వేతా (ఎక్కడికి పోతావు చిన్నవాడా)
- ఉత్తమ చిత్రం : పెళ్లి చూపులు
- ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (ఊపిరి)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: కార్తిక్ (అ..ఆ-ఎల్లిపోకే శ్యామల)
- ఉత్తమ నేపథ్య గాయని: చిత్ర (నేను శైలజ-ఈ ప్రేమకీ)
- ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి (ప్రణామం.. పాట.. జనతా గ్యారేజ్)
- ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: దేవిశ్రీ ప్రసాద్ (నాన్నకు ప్రేమతో)
- ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్ అవార్డు (నటుడు): అల్లు అర్జున్ (సరైనోడు)
- ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్ అవార్డు (నటి): రీతూ వర్మ (పెళ్లి చూపులు)