: వెండి తెరపైకి ‘మిస్టర్ ఇండియా-2... అందులోనూ అనిల్ కపూర్, శ్రీదేవి జంటే?
సుమారు ముఫ్పై ఏళ్ల క్రితం విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ ఇండియా’ ఎన్నో రికార్డులు సృష్టించింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం నాడు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. మళ్లీ ఇన్నాళ్లకు ‘మిస్టర్ ఇండియా-2’ను తెరకెక్కించే ఉద్దేశంలో ఉన్నారని, ఈ చిత్రంలో కూడా అనిల్, శ్రీదేవి జంటగా నటించనున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ‘మిస్టర్ ఇండియా’కు నాడు దర్శకత్వం వహించిన శేఖర్ కపూర్, రెండో భాగానికి దర్శకత్వం వహించనని గతంలో ప్రకటించారు. దీంతో, మిస్టర్ ఇండియా-2’ దర్శకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే విషయమై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా, శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రం వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక ‘మిస్టర్ ఇండియా-2’పై శ్రీదేవి దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.