: ‘ఛాంపియన్స్’ పోరు మొదలైంది!
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్-పాక్ మధ్య పోరు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, పాక్ బ్యాటింగ్ కి దిగింది. పాక్ ఓపెనర్లు అజహర్ అలీ, ఫకర్ జమాన్ బరిలోకి దిగారు. భారత బౌలర్ భువనేశ్వర్ వేసిన మొదటి బంతిని అజహర్ అలీ కొట్టడంతో ఈ పోరు మొదలైంది. మొదటి ఓవర్ లో పాక్ ఒక్క పరుగూ చేయలేదు. దీంతో, భువనేశ్వర్ ఖాతాలో ఒక మెయిడెన్ ఓవర్ చేరింది.