: రిసార్టులలో పట్టుబడ్డ యువతీ యువకులు
హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న రిసార్టులు అసాంఘిక, అసభ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయి. ఈ రోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వేర్లపల్లి గేటు వద్ద చేతన రిసార్టుపై పోలీసులు తనిఖీలు నిర్వహించి, 11 మంది యువతులు, 39 మంది యువకులను అరెస్ట్ చేశారు. పోలీసులు అప్పుడప్పుడు పేరుకు దాడులు చేయడం, రిసార్టులలో అసభ్య కార్యకలాపాలు యథావిధిగా జరిగిపోవడం సర్వసాధారణమైపోయింది.