: నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ...ఆరు కేజీల బంగారం, 15 లక్షల రూపాయల దోపిడీ


కర్నూలు జిల్లాలో భారీ దోపిడీ వెలుగు చూసింది. కోవెలకుంట్ల గాంధీసెంటర్‌ లో ఆంజనేయులు అనే నగల వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఆయన తన భార్యతో కలిసి హైదరాబాదు వెళ్లారు. దీనిని గమనించిన దుండగులు ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి బీరువాలోని ఆరు కేజీల బంగారు నగలు, 15 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లిపోయారు. ఆయన ఇంటికి వచ్చి చూసుకుని దోపిడీని గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారమందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News