: కాంగ్రెస్‌కు షాకిచ్చిన ములాయం.. రాష్ట్రపతి ఎన్నికల్లో తన మద్దతు ఎన్‌డీఏకేనన్న నేతాజీ!


రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు పోటీగా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష కూటమికి సమాజ్‌వాదీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ షాకిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన మద్దతు ఎన్‌డీఏ అభ్యర్థికేనని తేల్చి చెప్పారు. ఆయన నిర్ణయంతో ప్రతిపక్ష కూటమి కంగుతింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ అన్ని పార్టీలకు చెందిన నేతలను వరుసగా కలుస్తూ వస్తోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ములాయం సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తన మద్దతు ఎన్‌డీఏ అభ్యర్థికేనని ములాయం వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ మాత్రం కాంగ్రెస్‌తోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News