: నరేంద్రమోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విదేశీ కిడ్స్ చానళ్లకు చెక్.. డీడీ నుంచి త్వరలో ‘చిన్నారుల చానల్’!
నరేంద్రమోదీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ కిడ్స్ చానళ్ల ప్రభావంలో పడి కొట్టుకుపోతున్న చిన్నారులకు భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, పురాణేతిహాసాలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా కిడ్స్ చానల్ ప్రారంభించాలని నిర్ణయించింది. పూర్తిగా కార్టూన్లతో కూడిన చానల్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు దూరదర్శన్ కసరత్తు ప్రారంభించింది. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించే పనిలో పడింది.
పాప్యులర్ కిడ్స్ చానళ్లు అయిన షిన్ చాన్, డోరెమాన్, నింజా హట్టోరి తదితర విదేశీ అనువాద చానళ్లను వీక్షిస్తున్న చిన్నారులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు తెలియకుండా పోతుండడంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకుంది.