: అసోం, మేఘాలయలో వరదల విశ్వరూపం.. ముగ్గురి మృతి, నిరాశ్రయులైన 30 వేల మంది!


ఈశాన్య రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వేలాదిమందిని నిరాశ్రయులను చేస్తున్నాయి. మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో శనివారం ఉదయం కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విరిగి పడిన కొండ చరియల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

ఇక అసోంలో వరదల కారణంగా 30 వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 52 గ్రామాల నుంచి 25 వేల మంది ప్రజలు వరదల కారణంగా నిరాశ్రయులైనట్టు అధికారులు తెలిపారు. నదులు ప్రమాద స్థాయిని మించి పొంగిపొర్లుతున్నాయి.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News