: పాక్ జట్టుపై బాలీవుడ్ స్టార్ రిషికపూర్ సంచలన ట్వీట్.. ఆడేది అబ్బలని హెచ్చరిక!
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నేడు భారత్-పాక్‌లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. వేల కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. భారత్‌పై నెగ్గేందుకు ఏం చేయాలో పాక్ జట్టుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
కాగా, బాలీవుడ్ స్టార్ రిషికపూర్ ఈ మ్యాచ్‌పై సంచలన ట్వీట్ చేశాడు. అందులో పాక్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘పాక్ క్రికెట్ బోర్డు క్రికెట్ జట్టును మాత్రమే పంపించాలి. హాకీ టీమునో, ఖోఖో జట్టునో కాదు. ఎందుకంటే 18 (ఫాదర్స్ డే)న ఫైనల్లో మీతో ఆడేది అబ్బలు(తండ్రులు)’’ అంటూ ట్వీట్ చేశాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ నెగ్గిన తర్వాత కూడా రిషికపూర్ పాక్ జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశాడు. పాక్‌కు శుభాకాంక్షలు చెబుతూనే తమ జట్టు రంగు అయిన నీలం (బ్లూ)ను ధరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతేకాదు వరుస ట్వీట్లు చేస్తూ ఈ విషయంలో ముందున్నాడు. భారత్-పాకిస్థాన్‌ను ‘తండ్రి-కొడుకు’తో పోల్చిన మొదటి సెలిబ్రిటీ రిషికపూరే.