: రేప‌టి ఫైన‌ల్‌లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వ‌డానికి ఉవ్విళ్లూరుతున్నాం!: విరాట్ కోహ్లీ


ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు జరగనున్న బిగ్ ఫైట్ కి సిద్ధమయినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ రోజు లండన్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కోహ్లీ మాట్లాడుతూ.... రేప‌టి ఫైన‌ల్‌లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వ‌డానికి ఆట‌గాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నార‌ని అన్నాడు. గెలుపు కోసం పాక్‌, భార‌త్‌ జట్లు శ‌క్తిమేర‌కు పోరాడతాయని అన్నాడు. రేప‌టి పోరులో త‌మ‌ వ్యూహాలు మార్చే ఉద్దేశం లేద‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల‌కు దూరంగా ఉంటూ, వాటిలో వచ్చే వార్తల గురించి అతిగా ఆలోచించకపోవడమే మంచిదని వ్యాఖ్యానించాడు. ఇతర విషయాల గురించి తాము ఆలోచించబోమ‌ని, పాజిటివ్ థింకింగ్‌తో రేపు ఆడ‌తామ‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News