: రెవెన్యూ శాఖలో 2,506 ఉద్యోగాల భర్తీకి ఆమోదం... హోం శాఖలోనూ భారీగా ఉద్యోగ నియామకాల కోసం తెలంగాణ కేబినెట్లో చర్చ!


తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో రాష్ట్ర‌ కేబినెట్ భేటీ అయింది. ముఖ్యంగా ఉద్యోగాల భ‌ర్తీ అంశంపై చ‌ర్చిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖలో మొత్తం 2,506 ఉద్యోగాల నియామకానికి ఆమోదం తెలిపిన కేసీఆర్‌... ఉద్యోగాల భ‌ర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాల నియామ‌కాల్లో 1000 వీఆర్‌ఏలు, 700 వీఆర్‌వోలు, 400 టైపిస్టులు, 100 డిప్యూటీ సర్వేయర్లు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 100 మంది సర్వేయర్ల పోస్టుల భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాదు, తెలంగాణ‌ హోంశాఖలో భారీగా ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ అంశంపై కేబినెట్ నిర్ణ‌యం తీసుకుని ప్ర‌క‌టన చేయ‌నుంది.      

  • Loading...

More Telugu News