: ప్రాక్టీసులో అశ్విన్ మోకాలికి గాయం.. రేపటి మ్యాచ్ లో ఆడడం డౌటే!
టీమిండియా అభిమానులకు చేదు వార్త... ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం రేపు పాకిస్థాన్‌తో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. ఈ రోజు మైదానంలో ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా... క్యాచ్‌ని అందుకునేందుకు ప్రయత్నించిన అశ్విన్ కిందపడ్డాడు. అతడి శరీర బరువు మొత్తం కుడికాలు మోకాలిపై పడటంతో మైదానంలో నొప్పితో గిలగిలడిపోయాడు. అతడికి చికిత్స అందించినప్పటికీ పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆయన రేపు మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.