: 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మైక్రోమ్యాక్స్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్


దేశీయ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఈ రోజు మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ‘ఎవోక్ పవర్’ పేరుతో విడుద‌లైన ఈ స్మార్ట్‌ఫోన్ లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం క‌లిగి ఉండ‌డంతో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తోంది. దీని ధ‌ర రూ.6,999. చైనా కంపెనీ షియోమీ విడుద‌ల చేస్తోన్న బ‌డ్జెట్ స్మార్ట్‌పోన్‌ల‌కు పోటీగా ‘ఎవోక్ పవర్’ను విడుద‌ల చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ డియో, గానా, ఉబెర్ లాంటి యాప్స్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేశారు.

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు..  
 2జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ మెమొరీ (2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు)
 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా

  • Loading...

More Telugu News