: దేశంలోనే అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు: ప్రసన్నకుమార్ రెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబే అసమర్థుడని విమర్శించారు. మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదని మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోతే చంద్రబాబుకు, టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.