: టీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతోందన్న వార్తలపై కొండా సురేఖ స్పందన!
ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ ఆమె సొంతగూటికి చేరుకోబోతున్నారని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ వార్తలపై ఆమె స్పందించారు. రాజకీయపరంగా దివంగత రాజశేఖర్ రెడ్డి తనకు జన్మనిస్తే, కేసీఆర్ పునర్జన్మను ఇచ్చారని ఆమె అన్నారు. తాను టీఆర్ఎస్ ను వీడబోతున్నాననేది దుష్ప్రచారం మాత్రమే అని చెప్పారు. తామంటే గిట్టని వ్యక్తులే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, తన రాజకీయ వారసులు ఎవరో ఆమె స్పష్టం చేశారు. తన కుమార్తె సుస్మితా పటేలే తన రాజకీయ వారసురాలు అని... అయితే, 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేసే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.