: నిరుద్యోగులకు శుభవార్త.. 137 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు అనుమతి
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త... రాష్ట్ర సీసీఎల్‌ఏ శాఖలో 109 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 13 సీనియర్ స్టెనో, 15 జూనియర్ స్టెనో ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ తెలంగాణ సర్కారు ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూశాఖలోని ఈ 137 ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.