: కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. కాల్వ శ్రీనివాసులు, భూమా అఖిలప్రియ, శిల్పా చక్రపాణిరెడ్డి హాజరు


క‌ర్నూలు జిల్లాలో త‌మ‌ పార్టీ సమన్వయం, నేతల్లో నెలకొన్న విభేదాల ప‌రిష్కారంపై చ‌ర్చించేందుకు ఆ జిల్లా నేత‌ల‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి కాల్వ శ్రీనివాసులు, మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత‌లు టీజీ వెంకటేశ్‌, శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు ప‌లువురు ఇందులో పాల్గొంటున్నారు.  కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల్లో తలెత్తుతోన్న విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ రోజు ఉద‌యం చంద్ర‌బాబు నాయుడు అనంతపురం జిల్లా నేతలతోనూ స‌మావేశ‌మై... జిల్లాలో జ‌రుగుతున్న ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి చ‌ర్చించారు.     

  • Loading...

More Telugu News