: రాష్ట్రపతి అభ్యర్థిగా నేనా? నో..!: సుష్మా స్వరాజ్


వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో మ‌రో రెండు, మూడు రోజుల్లో ఎన్డీఏ తమ అభ్య‌ర్థి పేరును ప్ర‌క‌టించ‌నున్నట్టు వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పేరును ప్ర‌క‌టిస్తారంటూ బలంగా చ‌ర్చ జ‌రుగుతున్న వేళ దీనిపై ఆమె స్పందించారు. ఈ ఎన్నిక‌ల్లో తాను అభ్యర్థిగా నిలబడనున్నట్టు వస్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆమె అన్నారు. ఈ రోజు ఆమెను మీడియా ప్ర‌శ్నించ‌గా ఆమె ఆ విధంగా స‌మాధానం ఇచ్చారు. తాను ప్రస్తుతం విదేశాంగమంత్రినని, రాష్ట్రపతి అభ్యర్థిపై మీడియా అడుగుతున్న ప్రశ్న అంతర్గత వ్యవహారం అని వ్యాఖ్యానించారు.      

  • Loading...

More Telugu News