: పాక్ కెప్టెన్ కు కీలకమైన సూచనలు చేసిన ఇమ్రాన్ ఖాన్


ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ ను ఎదుర్కోనున్న తరుణంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కు లెజెండరీ క్రికెటర్, పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పలు సూచనలు చేశారు. పాకిస్థాన్ టాస్ గెలిస్తే పొరపాటున కూడా ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించవద్దని ఆయన సూచించారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉందని... తొలుత బ్యాటింగ్ చేస్తే, భారీ స్కోరు సాధిస్తుందని చెప్పారు. భారత్ భారీ స్కోరు సాధిస్తే, పాకిస్థాన్ ఒత్తిడికి గురి అవుతుందని తెలిపారు. పాక్ బలం బౌలింగ్ అని... అందువల్ల పాక్ తొలుత బ్యాటింగ్ చేయాలని, ఆ తర్వాత భారత బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టాలని సూచించారు. లీగ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ కు... ఫైనల్లో ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.  

  • Loading...

More Telugu News