: ఇఫ్తార్ విందులో సందడి చేసిన పాకిస్థాన్ క్రికెటర్లు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెటర్లు లండన్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, లండన్ లోని పాకిస్థాన్ హైకమిషన్ లో పాక్ క్రికెటర్ల కోసం ప్రత్యేక ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విందుకు పాక్ క్రికెటర్లు హాజరయ్యారు. వీరితో పాటు పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్, పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నాజమ్ సేథీ కూడా ఈ విందుకు హాజరయ్యారు. కెప్టెన్ సర్ఫరాజ్, మహ్మద్ అమీర్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో పాటు విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తమ దేశ క్రికెటర్లతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు.