: సిమ్లా మున్సిపల్ ఫలితాల్లో బీజేపీ ముందంజ... గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఈ రోజు జరుగుతోంది. మొత్తం 34 మంది సభ్యులుగల మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికి 20 స్థానాలకు కౌంటింగ్ పూర్తయింది. బీజేపీ మద్దతుతో నిలిచిన అభ్యర్థులు 9 చోట్ల, కాంగ్రెస్ అభ్యర్థులు 7 స్థానాల్లో గెలుపొందారు. మూడు స్వతంత్రులకు వెళ్లాయి. సీపీఎం అభ్యర్థి ఒకటి గెలుచుకున్నారు. మరో 14 స్థానాలకు కౌంటింగ్ నడుస్తోంది. సిమ్లా మన్సిపాలిటీని కాంగ్రెస్ 26 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంతో ఏలగా, 2012లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను సీపీఎం గెలుచుకుంది.