: గంగూలీ కారును అడ్డుకున్న పాక్ అభిమానులు.... వీడియో చూడండి
పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు బరితెగించారు. టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై దాడికి ప్రయత్నించారు. సౌరవ్ గంగూలీ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా సేవలందిస్తున్నారు. ఇంగ్లండ్ పై విజయం సాధించి, పాక్ జట్టు ఫైనల్ చేరిన సందర్భంగా హోటల్ కు వెళ్తున్న గంగూలీ కారును పాక్ అభిమానులు అడ్డుకున్నారు. ఇండియా ముర్దాబాద్...పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. మరికొందరు ఆయన కారెక్కే ప్రయత్నం చేశారు. ఇంకొందరు ఆయన కారు డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న గంగూలీ పాకిస్థాన్ వెర్రి అభిమానులను, వారి చేష్టలను చూస్తూ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా...చిరునవ్వుతో కూర్చున్నారు. ఇంతలో లండన్ పోలీసులు వచ్చి, గంగూలీ కారుకు దారిచ్చి పంపించారు. ఈ సంఘటన భారత అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేస్తోంది. రేపటి ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించి తగిన సమాధానం చెప్పాలని జట్టును కోరుతున్నారు.