: కాయ్ రాజా కాయ్: పాక్ గెలిస్తే రూ.100కి 300... భారత్ గెలిస్తే రూ.147... రూ.2,000 కోట్ల పందేలు!


చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్, పాక్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయన్న అంచనాల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఫైనల్ మ్యాచ్ పై అంతర్జాలం వేదికగా రూ.2,000 కోట్ల విలువ మేర పందేలు జరుగుతున్నట్టు అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) పేర్కొంది. ఎక్కువ మంది బుకీలు భారత్ కు ఫేవర్ గా ఉన్నారు. భారత్ ఏడాది పొడవునా ఆడే మ్యాచులపై సుమారు రూ.2లక్షల కోట్ల మేర పందేలు జరుగుతుంటాయని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ సీఈవో రోలాండ్ ల్యాండర్స్ తెలిపారు. ‘‘గత పదేళ్లలో భారత్, పాకిస్థాన్ ఫైనల్ లో తలపడడం ఇదే మొదటి సారి. దీంతో పందేలు తారా స్థాయిలో ఉన్నాయి’’ అని వివరించారు. భారత్ పై రూ.100 పందేం వేస్తే... ఒకవేళ కోహ్లీ సేనే గెలిస్తే రూ.147 గెలుచుకుంటారు. భారత్ ఓడి పాక్ ను విజయం వరిస్తే రూ.300 సొంతం చేసుకుంటారు.

  • Loading...

More Telugu News