: కేటీఆర్ కు అభినందనలు తెలిపిన హరీష్ రావు


సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజెస్ పార్క్ కు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. మెడికల్ డివైజెస్ పార్క్ కోసం కేటీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణను ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారంటూ కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల వల్ల రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు చాలా వస్తున్నాయని అన్నారు. మెడికల్ డివైజెస్ పార్క్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెప్పారు. గతంలో కరెంట్ లేక అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని, ఇప్పుడు ఆ సమస్య లేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చూపిన స్ఫూర్తినే... రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News