: లంచ్ టైమ్: ఫ్యామిలీలతో కలసి విందారగించిన రోహిత్, ధావన్, రహానే
సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ ను మట్టికరిపించిన టీమిండియా ఆటగాళ్లు మంచి జోష్ మీదున్నారు. ఈ టోర్నీలో టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. ఇంకా ఫైనల్ ఒక్కటే మిగిలి ఉన్న నేపథ్యంలో లండన్ లో ధావన్, రోహిత్, అజింక్యా రహేనే తమ కుటుంబంతో కలిసి లంచ్ చేశారు. ఈ ముగ్గురూ తమ భార్యలతో ఆనందంగా గడపగా, ఈ లంచ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం శిఖర్ ధావన్ కుమారుడు జోరావర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సందర్భంగా దిగిన ఫోటోను ధావన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. కాగా, రోహిత్ శర్మ తీసే ప్రతిఫోటోలో జొరావర్ సండది చేస్తూ కనబడుతున్నాడు. జొరావర్ ను తమ జట్టు బాహుబలిగా పేర్కొంటూ రోహిత్ ఇటీవల పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో 4 ఇన్నింగ్స్ లలో శిఖర్ దావన్ (317) అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలవగా, అతని తరువాతి స్థానాల్లో రోహిత్ శర్మ (304), విరాట్ కోహ్లీ (253) నిలిచారు. ఫైనల్ లో ఈ ముగ్గురిలో ఎవరు రాణిస్తే వారినే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించే అవకాశం ఉంది. కాగా, పాకిస్థాన్ పై రాణించాలని ఈ ముగ్గురూ భావిస్తున్నారు.