: భారత్ ను సందర్శించండి... భారత సంతతి ఐర్లండ్ ప్రధానికి మోదీ ఆహ్వానం
ఐర్లండ్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి, ట్రాన్స్ జెండర్, 39 ఏళ్ల లియోవరద్కార్ ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయనకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతోపాటు భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని వరద్కార్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. భారత్ కు తన మద్దతును ప్రకటించారు. వదర్కార్ 1979లో డబ్లిన్ లో జన్మించారు. ఆయన తల్లి ఐర్లండ్ కు చెందిన నర్స్ కాగా, తండ్రి మాత్రం ముంబైకి చెందిన డాక్టర్.