: అద్వానీకి ఇక అవకాశం లేనట్టేనా...?


బీజేపీ మార్గదర్శకుడు, ఒకప్పుడు ఒంటి చేత్తో పార్టీ పటిష్ఠతకు పాటు పడిన లాల్ కృష్ట అద్వానీని రాష్ట్రపతి పదవితో గౌరవించే ఉద్దేశం బీజేపీకి లేనట్టు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీకి వెలుపల వ్యక్తిని కూడా ఎంపిక చేసే అవకాశాల్లేవన్నది సమాచారం. బీజేపీ నేతలు ప్రతిపక్షాల నాయకులతో సంప్రదింపులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు నిన్ననే అద్వానీతోపాటు మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషిలను కలసి రాష్ట్రపతి విషయంలో వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అద్వానీ, జోషి రాష్ట్రపతి స్థానానికి ప్రధాన పోటీదారులుగానే ఉన్నప్పటికీ... పార్టీ నాయకత్వం పట్ల వారు అనుకూలంగా లేరని, దీంతో వారిని కీలకమైన రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి పరిశీలించకపోవచ్చన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.

  • Loading...

More Telugu News