: ఈ కారణం వల్లనే చంద్రబాబు కేసులపై ఒక్క దర్యాప్తు కూడా జరగడం లేదు: రఘువీరా సంచలన ఆరోపణలు
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత మూడేళ్ల నుంచి దోచుకోవడమే చంద్రబాబు పనిగా మారిందని విమర్శించారు. ఈ దోపిడీ సొమ్ములో ప్రధాని మోదీకి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఈ కారణం వల్లే... ఇతర రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దర్యాప్తులు జరుగుతున్నా, ఏపీలో మాత్రం ఎలాంటి దర్యాప్తులు జరగడం లేదని అన్నారు. ఓటుకు నోటు కేసు సహా పలు అంశాలపై దర్యాప్తుకు మోదీ ముదుకు రావడం లేదని చెప్పారు. విశాఖ భూముల వివాదంలో వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు, జిల్లా కలెక్టర్ నిజాలు వెల్లడించకుండా ఉండేందుకు... త్రిసభ్య కమిటీని వేసి చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని తెలిపారు. చంద్రబాబు అవినీతిపై ప్రజల్లోకి వెళతామని, దశలవారీగా ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.