: విశేషాల కొచ్చి మెట్రో రైలు... మోదీ చేతుల మీదుగా ప్రారంభం


కేరళలోని కొచ్చి నగరంలో మెట్రో రైలును నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఫ్రాన్స్, జర్మన్ రాయబారులు దీనికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం కోసం మోదీ కొద్ది సేపటి క్రితమే కొచ్చి చేరుకున్నారు. గవర్నర్ సదాశివం, సీఎం పి.విజయన్ ఆహ్వానం పలికారు.
* దేశంలో అత్యంత వేగంగా నిర్మితమైన మెట్రో ఇదే.
* మూడో లింగం (స్త్రీ, పురుషులు కాకుండా) వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కేటాయించినదీ ఇదే. వివిధ విభాగాల్లో 23 మందికి చోటు కల్పించారు.
* రైల్వే లైన్ పొడువునా, 22 స్టేషన్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యుత్ అవసరాలు తీరనున్నాయి. మొత్తం విద్యుత్ అవసరాల్లో సోలార్ ద్వారా 25 శాతం భర్తీ చేసుకోవాలన్నది ప్రణాళిక.

  • Loading...

More Telugu News