: దినకరన్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: జయలలిత మేనకోడలు తీవ్ర ఆరోపణలు
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తనను బెదిస్తున్నారని అన్నారు. ఈ ఉదయం ఓ ఛానల్ లో ఆమె మాట్లాడుతూ, పార్టీలోని క్షేత్రస్థాయి కార్యవర్గమంతా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా తననే ఉండాలని పట్టుబడుతున్నారని చెప్పారు.
పార్టీకి ముందు నుంచి వెన్నెముకగా ఉన్న నేతలంతా తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని... అమ్మ వారసత్వాన్ని తానే కొనసాగించాలని పట్టుబడుతున్నారని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనకే ఎక్కువ మద్దతు ఉందని చెప్పారు. అయితే ఎక్కువ మద్దతు తనకే ఉందంటూ దినకరన్ తప్పుడు లెక్కలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దినకరన్ బ్లాక్ మెయిలింగ్ కు తాను భయపడనని చెప్పారు.