: శిరీష, ప్రభాకర్ రెడ్డిలవి ఆత్మహత్యలని పోలీసులు తేల్చినా.... కుటుంబ సభ్యులు వెలిబుచ్చుతున్న అనుమానాలివే!


హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని, అలాగే సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై ప్రభాకర్ రెడ్డిది కూడా ఆత్మహత్యేనని పోలీసులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 ముద్దాయి శ్రావణ్ అని, ఏ2 ముద్దాయి  రాజీవ్ అని పేర్కొన్నారు. దీనిపై శిరీష, రాజీవ్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరివీ హత్యలేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వారు వెలిబుచ్చుతున్న అనుమానాల్లోకి వెళ్తే... శిరీష ఆత్మహత్య కేసులో శ్రావణ్ ఏ1 ముద్దాయి ఎందుకయ్యాడు? శిరీషకు రాజీవ్ తో శారీరక సబంధం ఉందని చెబుతున్న పోలీసులు, రాజీవ్ తీసుకెళ్లడంతోనే శిరీష వెళ్లిందని చెబుతున్న పోలీసులు, కారులో రాజీవ్ ఆమెపై పలు మార్లు దాడి చేశాడని, కారు దిగిపారిపోయే ప్రయత్నం చేసిన శిరీషను జుట్టు పట్టుకుని పట్టుకొచ్చింది రాజీవేనని చెబుతున్న పోలీసులు...ఏ1గా శ్రావణ్ ను ఎందుకు పేర్కొన్నారు? అన్నది ఒక అనుమానం. అలాగే శిరీషపై అత్యాచారయత్నం మాత్రమే జరిగితే...శిరీషను రాజీవ్ కారులో ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అసలు కుక్కునూరుపల్లిలో జరిగింది అత్యాచారమా? లేక అత్యాచారయత్నమా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

శిరీషను తీసుకెళ్లిన రాజీవ్, శ్రావణ్ లు ఆమెను కేవలం చర్చలకే తీసుకెళ్లారా? లేక ఎస్సైతో ఏదైనా లోపాయికారీ ఒప్పందం చేసుకుని తీసుకెళ్లారా? సెటిల్ మెంట్ కి తీసుకెళ్లిన మహిళపై ఎస్సై అత్యాచారయత్నం ఎందుకు చేశాడు? జీన్స్ పై షర్ట్ ధరించిన శిరీష వద్దకు చున్నీ ఎలా వచ్చింది? ఆరు అడుగుల పొడవు, 80 కేజీల బరువున్న శిరీష ఫ్యాన్ కు ఉరివేసుకోవడం సాధ్యమా? టీవీలలో చూపిస్తున్న విజువల్స్ ఆమె ఉరివేసుకుదన్న ఆరోపణలను బలపరుస్తున్నాయా?....ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రెండు గంటల తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అలాగే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యను మొదట ఎవరు గుర్తించారు? అతని గదిలోకి వెళ్లింది ఎవరు? క్లూస్ టీమ్ ను తీసుకెళ్లకుండా పోలీసు ఉన్నతాధికారి ఆ గదిలో ఎందుకు తనిఖీలు నిర్వహించారు?...ప్రభాకర్ రెడ్డి శిరీషపై కేవలం అత్యాచారయత్నమే చేస్తే కనుక ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు? అత్యాచారం చేయకుండా, అత్యాచారయత్నం చేస్తే పడే శిక్షల గురించి ప్రభాకర్ రెడ్డికి తెలియదా? అంటూ వారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News