: మలేషియా బ్యాట్మింటన్ టోర్నీ ఫైనల్స్ కు సింధు


రాష్ట్రానికి చెందిన బ్యాట్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు మలేషియా బ్యాట్మింటన్ గ్రాండ్ ప్రీ టోర్నీ సింగిల్స్ లో ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు కౌలాలంపూర్ లో జరిగిన సెమీ ఫైనల్స్ లో థాయిలాండ్ షట్లర్ పై 21-17, 21-11 తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఫైనల్స్ లో సింధు సింగపూర్ షట్లర్ ను ఢీకొట్టనుంది. 18 ఏళ్ల సింధు హైదరాబాదులోని గోపీచంద్ అకాడమీ విద్యార్థి.

  • Loading...

More Telugu News