: 'ఎప్పుడూ నాతోనే ఉంటావని ఆశిస్తున్నా..' అంటున్న అంజలి!


'జర్నీ' సినిమాతో అలరించిన కోలీవుడ్ హీరో జై, తెలుగు హీరోయిన్ అంజలి మధ్య అనుబందం ప్రత్యేకమైనదని, వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే జై పుట్టిన రోజు సందర్భంగా అంజలి షూటింగ్ స్పాట్ కు వెళ్లి సర్ ప్రైజింగ్ పార్టీ ఇవ్వడం, ఆ రోజంతా వారిద్దరూ కలిసే వుండడం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న జరిగిన అంజలి పుట్టిన రోజును పురస్కరించుకుని జై సోషల్ మీడియా వేదికగా అంజలిపై ప్రేమను కురిపించాడు.

 ‘‘నువ్వంటే నాకు ఎంత ప్రత్యేకమో... నీ పుట్టిన రోజన్నా అంతే ప్రత్యేకం! నీకెంతో ప్రత్యేకమైన ఈ రోజున నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు నీలానే ఉంటూ నా లైఫ్‌ లో ప్రతి రోజును ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దావ్‌. దేవుడు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాం. హ్యాపీ బర్త్‌ డే అంజూ. ప్రేమతో... జై!’’అంటూ స్వయంగా రాసిన లేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి అంజలి ‘‘నాతో ఉన్నందుకు థ్యాంక్స్‌ జై. నువ్వెప్పుడూ ఉంటావని ఆశిస్తున్నా..ప్రత్యేకమైన రోజు ప్రత్యేకమైన లేఖ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ అతని లేఖను రీట్వీట్ చేసింది. దీంతో వీరిద్దరి ప్రేమ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News