: బహిరంగ మలవిసర్జన చేసినందుకు 13 కుటుంబాలకు రూ.4 లక్షల ఫైన్!


బహిరంగ మలవిసర్జన చేసిన 13 కుటుంబాలకు రూ.4 లక్షల జరిమాన విధించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో జరిగింది. ఇటీవల విర్పూర్‌ గ్రామంలో ప్రభుత్వ బృందం ఒకటి పర్యటించింది. ఈ సందర్భంగా పొలాల్లో బహిరంగ మల విసర్జన చేస్తున్న 13 కుటుంబాలకు చెందిన వారిని పట్టుకున్నారు. ఆ వెంటనే అక్కడికక్కడే వారికి మొత్తంగా రూ. 3,95,500 జరిమానా విధించినట్టు బేగంగంజ్ జన్‌పద్ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రీమా అన్సారీ తెలిపారు. గ్రామంలోని  ప్రతి ఇంటికి టాయిలెట్లు ఉన్నప్పటికీ బహిరంగ మల విసర్జనకు పాల్పడినందుకే జరిమానా విధించినట్టు తెలిపారు. గతంలో పలుమార్లు వీరిని హెచ్చరించినప్పటికీ ప్రవర్తన మార్చుకోలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News