: ఫిక్సింగ్ పై మాట మార్చిన పాక్ మాజీ కెప్టెన్
ఫిక్సింగ్ చేయడం వల్లే పాకిస్థాన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరిందని సంచలన ఆరోపణలు చేసిన ఆ జట్టు మాజీ కెప్టెన్ అమీర్ సొహైల్ మాట మార్చాడు. పాక్ జట్టు ఫిక్సింగ్ కు పాల్పడిందని తాను అనలేదని, తన వ్యాఖ్యలు వక్రీకరించారని తెలిపాడు. కాగా, పాక్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీస్ కు ముందు అమీర్ సొహైల్ ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, పాక్ జట్టు తన శక్తిసామర్థ్యాల మీద నెగ్గడం లేదని అన్నాడు. పాక్ విజయంలో ‘బయటి శక్తుల’ ప్రభావం ఉందని అన్నాడు. అందువల్లే పాక్ జట్టు గెలిచిన ప్రతిసారీ కెప్టెన్ సర్ఫరాజ్ 'అభిమానుల మద్దతు వల్లే గెలిచామని, ప్రార్థనలే తమను గెలిపించాయని, దేవుడి దయవల్లే గెలిచామని' అంటున్నాడని అన్నారు. ఈ మాటల వెనుక భావాన్ని తాము అర్ధం చేసుకోగలమని, బయటి శక్తుల వల్లే పాక్ ఫైనల్ చేరిందని అన్నాడు.