: మరో ఐదు రోజుల్లో ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో తెలిసిపోతుంది!
ఏన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయానికి మరో ఐదు రోజుల్లో తెరపడనుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై ఎన్డీయే మిత్రపక్షాలతో ఈ నెల 19న భేటీ కానుంది. కూటమిలోని సభ్యుల అభిప్రాయాల మేరకు ఓ నిర్ణయానికి రానున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం. ఈ నెల 20న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి, రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసిన అనంతరం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్, ఎంఎస్ స్వామినాథన్, ‘మెట్రో’ మ్యాన్ శ్రీధరన్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అయితే, రాష్ట్రపతి అభ్యర్థిగా తాను రేసులో లేనని, అవన్నీ వదంతులేనని శ్రీధరన్ ఇప్పటికే కొట్టిపారేసిన విషయం విదితమే.