: ‘జై అల్లా.. జై శ్రీరాం’ అని నినదించమంటూ మతిస్థిమితం లేని యువతిని దారుణంగా కొట్టిన యువకులు
మతిస్థిమితం లేని ఓ యువతిని ఇద్దరు యువకులు పైపుతో దారుణంగా కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. అది కూడా దేవుళ్లకు జై కొట్టాలంటూ వారు ఆమెపట్ల ప్రవర్తించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని జాతీయ ఛానెళ్లలోనూ వచ్చింది. ఆ యువతిని ఇద్దరు వ్యక్తులు పైపుతో దారుణంగా కొడుతుండగా స్థానికులు సినిమా చూసినట్లు చూశారు. మతిస్థిమితం లేని ఆమెను ‘జై అల్లా అను, జై శ్రీరామ్, జై హనుమాన్ అను’ అంటూ ఆ యువకులు బలవంతం చేశారు. ఆమె అలా అనే వరకు కొట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ యువతి అరుపులు పెట్టినప్పటికీ స్థానికులు ఆ యువకులను అడ్డుకోలేదు. ఈ ఘటన పోలీసుల దృష్టికి రావడంతో నిందితులని అదుపులోకి తీసుకున్నారు.