: సాయం చేయమని వచ్చిన ట్వీట్‌కి వెంటనే స్పందించిన కేటీఆర్!
తన భార్యతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న ఖమ్మం పట్టణానికి చెందిన మేడిపల్లి రమేష్ ఈ రోజు కాన్పూర్ సమీపంలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన మృతదేహాన్ని రైల్వే అధికారులు తరలించగా, అక్కడి భాష రాకపోవడంతో రమేష్ భార్య లీలావతి ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రకిరణ్ అనే వ్యక్తి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్.. వారికి సంబంధించిన వివరాలు తెలపాలని కోరారు. ఆ వెంటనే రమేష్ భార్య లీలావతి ఫోన్ నెంబర్‌ను తెలుపుతూ కేటీఆర్‌కి ఆయన ట్వీట్ చేశారు. దీనిపట్ల స్పందించిన కేటీఆర్ వెంటనే ఆమెకు సాయం చేస్తానని చెప్పారు.